Tamannaah Bhatia | మూడుపదుల వయసు దాటినా వన్నెతరగని అందంతో అలరారుతున్నది అగ్ర కథానాయిక తమన్నా. ఇటీవలే ఈ భామ చిత్రసీమలో 18ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం తాలూకు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మతో ఈ అమ్మడు గత కొంతకాలంగా ప్రేమాయణాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రేమజంట మాల్దీవుల్లో విహార యాత్రకు వెళ్లొచ్చారు. అయితే విజయ్‌వర్మతో తన ప్రేమాయణం గురించి ఇప్పటివరకు ఎక్కడా పెదవి విప్పలేదు తమన్నా.
మీడియా సమావేశాల్లో సైతం తన లవ్ ఎఫైర్‌పై ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సున్నితంగా తిరస్కరిస్తుంటుంది. ఈ సందర్భంగా పెళ్లి గురించి తమన్నా మాట్లాడుతూ ‘భారతీయ వివాహ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. కొన్నాళ్ల క్రితమే వివాహం చేసుకోవాలనుకున్నా. కెరీర్లో బిజీగా మారడంతో పెళ్లి ఆలోచనలకు ఫుల్‌స్టాఫ్ పెట్టాను. ప్రస్తుతం భారీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. నా పెళ్లి ముచ్చట వినాలంటే చాలా రోజులు వేచి చూడాల్సిందే’ అని చెప్పుకొచ్చింది.