సాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘చౌకీదార్’. పృథ్వీ అంబర్, ధన్య రమ్యకుమార్ జంటగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో చంద్రశేఖర్ బండియప్ప రూపొందిస్తున్నారు. కల్లహల్లి చంద్రశేఖర్ నిర్మాత. సోమవారం ఈ సినిమాలోని ఓ ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు.
నాన్న గొప్పదనాన్ని తెలియజెపుతూ హృద్యంగా సాగిందీ గీతం. సచిన్ బస్రూర్ స్వరపరచిన ఈ పాటను విజయ్‌ప్రకాష్ ఆలపించారు. సాయికుమార్ తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు. పృథ్వీఅంబర్, సాయికుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు హృదయాన్ని కదిలించేలా ఉన్నాయి. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.