బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల జాబితాలో చేరారు రాజమౌళి. ప్రస్తుతం ఆయన మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలున్నాయి. ఈ ప్రస్టేజియస్ పాన్ ఇండియా సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారట. ఇటీవలే విక్రమ్‌కి రాజమౌళి కథ వినిపించారట.
ఆయన కూడా రాజమౌళీ సినిమాలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తున్నది.అమేజాన్ అడవుల నేపథ్యంలో నిధి అన్వేషణే ప్రధానాంశంగా రూపొందనున్న ఈ సినిమాలో విక్రమ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నదని సమాచారం. ప్రఖ్యాత భారతీయ నటులతోపాటు, హాలీవుడ్‌కి చెందిన నటులు కూడా భాగమవుతున్న ఈ సినిమాకు మాటలు: దేవకట్టా, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: కె.ఎల్.నారాయణ, నిర్మాణం: దుర్గా ఆర్ట్స్.