Neha Sharma | మెగా హీరో రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత() సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది బీహారీ బ్యూటీ నేహా శర్మ (Neha Sharma).. ఎంట్రీతోనే తన అందాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. అనంతరం వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమాలో కనిపించి అలరించింది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత అవకాశాలు సరిగ్గా రాకా తెలుగు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తుంది. అయితే ఈ భామ తాజాగా ఫుడ్ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత విహార్‌లో ‘కాల్ మీ టెన్ అనే పేరుతో జపనీస్ రెస్టారెంట్‌ను ప్రారంభించింది ఈ భామ. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా ప్రచూరించింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. నేహ శర్మ ప్రస్తుతం ‘హేరా ఫేరీ 3లో నటిస్తుంది. రీసెంట్గా నేహ తండ్రి బీహార్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటి చేసి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.
Also Read..