బ్రౌజింగ్ | నెట్టింట్లో ఏ వెబ్సైట్ తలుపు తెరవాలన్నా బ్రౌజర్‌ని ఓపెన్ చేయాల్సిందే. బ్రౌజర్ అంటే మనకు తెలిసింది క్రోమ్. సెర్చింజన్ అంటే గూగుల్. కొద్దిమంది మైక్రోసాఫ్ట్ బింగ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఉపయోగిస్తుంటారు. ఈ క్రోమ్ బ్రౌజర్‌తో గూగుల్ గుట్టు చప్పుడు కాకుండా మన వెబ్ విహారాన్ని నిరంతరం ట్రాక్ చేస్తుంది. మనం ఏం వెతుకుతున్నామో పసిగడుతుంది. కుకీస్ని కట్టుదిట్టంగా బ్రౌజర్లో కూర్చోబెట్టేసి మన గుట్టంతా వెబ్సైట్లకు రట్టు చేస్తుంది. అందుకే నెటిజన్ ప్రైవసీని కాపాడుకోవడం విధిగా అలవర్చుకోవాలి. ఈ రోజు రోజువారీ బ్రౌజింగ్ అవసరాలకు క్రోమ్, గూగుల్ తప్ప మరో ప్రత్యామ్నాయాన్ని అవసరం. అలాంటి బ్రౌజర్లు బోలెడున్నాయి. వాటిని మన ప్రైవసీని కాపాడుకుంటూ, కొత్త హంగులతో బ్రౌజింగ్ చేయొచ్చు. వీటిని ఒకసారి ట్రై చేయండి..
వ్యక్తిగత సమాచారం ఎవరికీ చిక్కకుండా ప్రైవేటుగా బ్రౌజింగ్ కోసం చక్కని వేదిక. సెర్చింజన్గానే కాకుండా బ్రౌజర్‌లా కూడా పనిచేస్తుంది. థర్డ్‌పార్టీ ట్రాకర్స్ అన్నిటినీ బ్రౌజర్ బ్లాక్ చేస్తుంది. దీంట్లో మీరు ఏ టాపిక్‌ని వెతికినా ప్రైవేటుగానే ఉంటుంది. ఏ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసినా.. కూకీస్ ’పాప్ అప్స్’ కనిపించవు. ఈ-మెయిల్ ట్రాకర్స్‌ని కూడా బ్లాక్ చేస్తుంది. యూట్యూబ్ వీడియోలను కూడా ఎలాంటి టార్గెట్ యాడ్స్ లేకుండా చూడొచ్చు. సెర్చింగ్ చేయడానికి సెర్చ్ రిజల్ట్స్‌ని భిన్నంగా అందిస్తుంది. ఫోన్, ట్యాబ్, సిస్టం.. అన్నిటిలోనూ సింక్ చేసుకుని వాడుకోవచ్చు. దీన్ని ఉపయోగించడానికి https://duckduckgo.com సైట్లోకి వెళ్లండి.
పర్యావరణహితంగా నెట్టింట్లో విహరిద్దాం అనుకుంటే ఇదో చక్కని సెర్చింజన్. దీని వాడడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చెట్లు పెంచే క్రతువులో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. ఈ వేదిక ద్వారా ఇప్పటికే 35 దేశాల్లో 213 మిలియన్లకు పైగా మొక్కలు నాటారు. యూజర్ ప్రైవసీ కాపాడుతూనే వెబ్ విహారానికి సాయపడుతుంది. దీన్ని బ్రౌజర్‌తో సిస్టమ్‌లో ఇన్స్టాల్ చేసుకుని క్రోమ్‌కి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. ఈ సర్వీసుని వాడేందుకు https://www.ecosia.org వెబ్సర్వీస్ని క్లిక్ చేయండి.
యూజర్ ప్రైవసీని కాపాడటమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. వ్యక్తిగత ఏ థర్డ్‌పార్టీ వెబ్సర్కి చిక్కకుండా బ్రేవ్‌లో సెర్చ్ చేయొచ్చు. ‘ఏఐ’ సపోర్ట్‌తో ప్రత్యేకంగా సెర్చ్ రిజల్ట్స్‌ని పొందొచ్చు. ఏఐ జనరేట్ కంటెంట్‌ని, సెర్చింజన్ ఫలితాలను ఒకేసారి పోల్చి చూసేందుకు దీంట్లో వీలుంది. దీనితో వెతుకులాటలో పక్కా పొందే వీలుంది. లా సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని కూడా వాడొచ్చు. దీన్ని ప్రయత్నిద్దాం అనుకుంటే… https://search.brave.com సైట్లోకి వెళ్లండి.
గూగుల్ సెర్చ్‌కి అలవాటు పడిపోయాం. ఇప్పుడెలా వేరే దాంట్లో బ్రౌజ్ చేయడం? అనుకుంటే.. స్టార్ట్ పేజ్ సెర్చింజన్ మీకు సరైన ఎంపిక. ఇంచుమించు గూగుల్ సెర్చింజన్ లానే కనిపిస్తుంది. కానీ, యూజర్ల ప్రైవసీ విషయంలో మాత్రం పక్కా స్ట్రిక్ట్. ఎలాంటి ట్రాకింగ్ విధానాలను యాక్సెప్ట్ చేయదు. ట్రాకింగ్ లేకుండా ఇంటర్నెట్… అనే నినాదంతో ఇది పనిచేస్తుంది. మొబైల్ యాప్‌ల ఫోన్లో వాడొచ్చు. డౌన్లోడ్, ఇతర వివరాలకు https://www.startpage.com/ సైట్‌ని చూడండి.
నేటి తరం నెటిజన్లకు సరిపడే సెర్చింజన్ ఇది. ‘ఏఐ’ సపోర్ట్‌తో కావాల్సిన సెర్చ్ రిజల్ట్స్‌ని అందిస్తుంది. దీనితో తక్కువ సమయంలోనే కావాల్సిన మొత్తం సేకరించొచ్చు. మీరు అడిగిన సమాచారానికి తగిన ఫాలో అప్స్‌ని కూడా భద్రపరుస్తుంది. టెక్ట్స్, ఇమేజ్‌లను విభాగాలుగా అందిస్తుంది. ట్రై చేస్తే కచ్చితంగా బుక్ మార్క్ చేసుకోవాల్సిందే. కావాలంటే https://www.perplexity.ai/ వెబ్‌సైట్‌ని చూడండి.