Chiru vs Prabhas | టాలీవుడ్‌కి సంక్రాంతి సీజన్ అంటేనే పెద్ద పండగ. ఏటా ఈ సీజన్‌కి మూడు లేదా నాలుగు క్రేజీ చిత్రాలు రిలీజ్ అయ్యినా, ప్రేక్షకుల అభిరుచి తగ్గదు. భారీ తారాగణంతో వస్తున్న సినిమాల మధ్య థియేటర్ల అడ్జస్ట్మెంట్ కూడా పెద్ద సవాలే. 2026 సంక్రాంతికి కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ ఓ రేంజ్లో ఉంటుందనిపిస్తుంది. ముందుగా సంక్రాంతికి వచ్చే వారిలో చిరంజీవి ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. సంక్రాంతికి పక్కా చిత్రాన్ని విడుదల చేయాలనే కసితో టీమ్ అంతా హార్డ్ వర్క్ చేస్తున్నారు.
ఈ సినిమాకి ట్యాగ్‌లైన్‌గా పండగకి వస్తున్నారు అని పెట్టడం విశేషం. చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ కాంబినేషన్‌కి భారీ క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి.ఇక సుదీర్ఘ కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ప్రభాస్ సినిమా ‘రాజాసాబ్’ ఇప్పటికి కూడా డిసెంబర్ రిలీజ్ నుంచి సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే 22 ఏళ్ల తర్వాత మరోసారి చిరంజీవి, ప్రభాస్ మధ్య సంక్రాంతి పోటీ అని చెప్పవచ్చు. 2004లో వర్షం (ప్రభాస్) vs అంజి (చిరంజీవి) సంక్రాంతికి పోటీ పడిన విషయం తెలిసిందే. అప్పుడు వర్షం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది, కానీ అంజి పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
ఇక ఈ సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ కూడా విడుదల కానుంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. తమిళ స్టార్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయకుడు’ చిత్రం కూడా అదే సమయానికి రిలీజ్ అవుతోంది.మరి కొన్ని చిత్రాలు కూడా సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి 2026 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాలుగు పెద్ద చిత్రాలు పోటీలో పడనుండడంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది. అయితే ఇందులో ఏ సినిమా హిట్ అవుతుంది? ఎవరిది సంక్రాంతి విజయం? అన్నదానికి సమాధానం మాత్రం ప్రేక్షకుల తీర్పుని బట్టి తెలుస్తుంది.