మెగా హీరో సాయి తేజ్ కేబుల్ బ్రిడ్జిపై తాను నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ నుండి కిందపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రాథమిక చికిత్స కోసం ముందుగా మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుండి అపోలో ఆసుపత్రికి తరలించారు.
సాయి తేజ్‌ని చూసేందుకు కుటుంబ సభ్యులందరు అర్ధరాత్రి కుటుంబ సభ్యులందరూ అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరాలు తీసారు. తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరంజీవి స్పష్టంచేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని త్వరలోనే కోలుకుంటాడని తెలిపారు. ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి మద్యం తాగలేదన్నారు. రోడ్డుపై ఇసుక ఉండడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారని ట్విట్టర్లో చిరంజీవి పేర్కొన్నారు.
@IamSaiDharamTej met with an accident few hours ago & has suffered minor injuries & bruises.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 10, 2021
Wish to share with All Fans & Well Wishers that There is absolutely NO cause for Concern or Anxiety.He is recovering under expert medical supervision & shall be back in a couple of days. pic.twitter.com/JnuZqx8aZT