మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). లూసిఫర్‌కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కీ రోల్లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ముంబైలో వేసిన స్పెషల్ సెట్స్ లో కొనసాగుతుంది. ఇటీవలే గాడ్ ఫాదర్ లొకేషన్లోకి సల్మాన్‌ఖాన్‌కు చిరంజీవి స్వాగతం పలుకుతున్న స్టిల్ ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
తాజా షెడ్యూల్లో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌పై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా కొత్త స్టిల్ ఒకటి రిలీజ్ చేశారు. చిరు గాడ్ ఫాదర్ గెటప్‌లో బ్లాక్ డ్రెస్‌లో కనిపిస్తుండగా..ఆ పక్కనే సల్మాన్ బ్లాక్ ప్యాంట్, బ్లూ టీ షర్ట్‌లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
A MEGA CLICK 📸
from the sets of #GodFather 🔥Mega🌟@KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #RBChoudary @ProducerNVP #Nayanthara @AlwaysRamCharan @MusicThaman @KonidelaPro @SuperGoodFilms_ pic.twitter.com/DvPKP5fPyc
— BA Raju's Team (@baraju_SuperHit) March 21, 2022
ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. నయనతార ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తుండగా..సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నయనతార ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్-కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్.