Chiru – Bobby | మెగాస్టార్ చిరంజీవి వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే Mega 158 గా రూపొందుతున్న “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో షూటింగ్ కొనసాగుతోంది. ఆ తరువాత, దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “విశ్వంభర” సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాల తరువాత చిరంజీవి, నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రేజీ లైనప్ తరువాత చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో సినిమాకు ఓకే చెప్పారు. కేవీఎన్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ఇటీవలే అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.
తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ స్టోరీ డ్రాఫ్ట్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ఆ డ్రాఫ్ట్‌తో పాటు కోల్‌కతా భాషలో ఒక కోట్‌ను జత చేయడంతో, ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా అని అర్థమవుతోంది. కోల్‌కతా నేపథ్యంలో చిరంజీవి చేసిన గత సినిమా ఎలా ఇండస్ట్రీ హిట్ అయ్యిందో తెలిసిందే. అందుకే, అదే సెట్టింగ్‌లో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ పైన అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. దర్శకుడు బాబీ కొల్లితో చిరంజీవి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹236 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. దీంతో ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ మళ్లీ రాబోతుంది కాబట్టి, అభిమానుల్లో ఉత్సాహం భారీగా పెరిగింది.
ఈ భారీ ప్రాజెక్ట్‌కు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్, గ్యాంగ్‌స్టర్ థీమ్, బాబీ – చిరంజీవి కాంబోని బట్టి ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.