చిరంజీవి కథానాయకుడిగా నటించిన కౌబాయ్ చిత్రం ‘కొదమసింహం’ (1990) చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కె.మురళీమోహన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ, సోనం, వాణీవిశ్వనాథ్ కథానాయికలుగా నటించారు. 1990 ఆగస్ట్9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘కొదమసింహం’ చిత్రాన్ని ఈ నెల 21న రీరిలీజ్ చేస్తున్నారు. 4కేలో కన్వర్షన్ చేసి, డిజిటల్ సౌండింగ్‌తో ముస్తాబుచేసిన సరికొత్త వెర్షన్ ట్రైలర్‌ను బుధవారం చిరంజీవి సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ స్వాగ్, అదిరిపోయే డ్యాన్స్‌తో ఈ సినిమా మరలా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని రమా ఫిలింస్ నిర్మాత కైకాల నాగేశ్వరరావు తెలిపారు.