టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరో తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ హీరో అజిత్ నటించిన యెన్నై అరిందాల్ ( Yennai Arindhal) తెలుగు రీమేక్ లో చిరంజీవి నటించనున్నాడు. ఈ సినిమాను హ్యాండిల్ చేసే సరైన దర్శకుడి వేటలో చిరంజీవి పడినట్టు ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసే విషయంలో డైరెక్టర్లు మారుతి ( Maruthi), వెంకీ కుడుముల (Venky Kudumula) ను చిరంజీవి టచ్ లోకి తీసుకున్నట్టు లేటెస్ట్ టాక్.
ఒకవేళ తనను డైరెక్ట్ చేయాలనుకుటే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి రావాలని చిరు సూచించగా..ఈ ఇద్దరు డైరెక్టర్లు అదే పనిలో ఉన్నారట. ఇద్దరిలో ఎవరు ఎక్కువగా స్క్రిప్ట్ చేస్తే వారితో చిరు సినిమా చేయనున్నాడన్నమాట. మొత్తానికి చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న తన కోరికను మారుతి ఇలా తీర్చుకుంటాడో..? లేదా వెంకీ కుడుముల ఆ అవకాశాన్ని కొట్టేస్తాడోనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.
మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. మరోవైపు మెహర్ రమేశ్ తో వేదాళమ్ రీమేక్ తోపాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చిరంజీవి. ఈ స్టార్ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అందరినీ ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతేడాది భీష్మతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వెంకీ కుడుముల కొత్త చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. మరోవైపు గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఇవికూడా చదవండి..
Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర