Vishwambhara | టాలీవుడ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా ఒకటి. అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉంటుంది.కొద్ది రోజుల క్రితం టీజర్ విడుదల కాగా, టీజర్‌పై విపరీతంగా ట్రోల్స్ రావడంతో గ్రాఫిక్స్‌పై మరింత కష్టపడుతున్నారు మేకర్స్. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులను హాలీవుడ్‌కి చెందిన వీఎఫ్ఎక్స్ స్టూడియోకి అప్పగించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ హాలీవుడ్ స్టూడియో విశ్వంభర సినిమాకు సాలిడ్ అవుట్ పుట్ని అందించనుందని సమాచారం.
పీరియాడిక్ ఫాంటసీ డ్రామా ‘విశ్వంభర’ స్పెషల్ సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉండగా, ఇప్పుడు ఈ సాంగ్ కోసం బాలీవుడ్ నటి మౌని రాయ్ హైదరాబాద్‌కి వచ్చినట్టు తెలుస్తుంది. బ్రహ్మాస్త్ర, గోల్డ్ వంటి హిందీ చిత్రాలతో పేరు తెచ్చుకున్న ఈ బెంగాలీ బ్యూటీ, ఇప్పుడు చిరుతో ఓ స్పెషల్ నెంబర్ కోసం టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది.ఇన్స్టాగ్రామ్ స్టోరీల ద్వారా హైదరాబాద్ వచ్చిన విషయం కన్ఫర్మ్ చేసిన మౌని, తన టీంతో కలిసి దిగిన ఫోటోలు కూడా షేర్ చేసింది. ఈ పాటను ప్రత్యేకంగా వేసిన సెట్లో మూడు నుంచి నాలుగు రోజుల పాటు చిత్రీకరించనున్నారు. మౌనీతో చిరు స్టెప్పులు ఏ రేంజ్లో ఉంటాయా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ‘విశ్వంభర’ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నా, ఈ స్పెషల్ సాంగ్‌కి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ పాట గురించి వస్తున్న బజ్ ప్రకారం, ‘అన్నయ్య’ సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ తరహాలో హై ఎనర్జీ మాస్ నంబర్‌గా ఉండనుందట.పాటకు కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ అందిస్తున్నారు. చిరు–మౌని కాంబినేషన్లో వచ్చే డాన్స్ మూమెంట్స్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ పాత్ర పోషిస్తుండగా, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.