Chiranjeevi | టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి బాస్ పార్టీ సాంగ్ ప్రోమో రిలీజవగా.. మంచి స్పందన వస్తోంది. మాస్ మూవీ లవర్స్ ను ఆకట్టుకునేలా ఈ సాంగ్ ఉండబోతుందని ప్రోమోతో తెలిసిపోతుంది.
కాగా పాట కోసం క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నానని తన ఎక్జయిట్మెంట్ ను షేర్ చేసుకున్నాడు చిరంజీవి. పాట కోసం వేసిన సెట్స్, లొకేషన్ షూటింగ్ స్టిల్స్ ను షేర్ చేశాడు. బాస్ పార్టీ రేపు మీ ముందుకొస్తున్న నేపథ్యంలో నేను ప్రత్యేకించి చెప్పాల్సింది ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ చేసిన ప్రొడక్షన్ డిజైన్, ఈ పాటకు చేసిన సెట్ వర్క్ మమ్మల్ని అందరినీ ఆకట్టుకుంది.
మీ ప్రశంసలు కూడా అతనికి దక్కుతాయని ఆశిస్తూ.. రెడీగా ఉండండి..రేపు పార్టీ షురూ అవుతుంది..అని ట్వీట్ చేశాడు చిరంజీవి. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. ఈ మూవీలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
బాస్ పార్టీ సాంగ్ లొకేషన్ స్టిల్స్..
#WaltairVeerayya First Single #BossParty💥 @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @UrvashiRautela @ThisIsDSP #SekharVJ #ArthurWilson #ASPrakash @MythriOfficial #GKMohan @SonyMusicSouth pic.twitter.com/FjMoMHvqbd
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 22, 2022
బాస్ పార్టీ సాంగ్ ప్రోమో.. వీడియో
Read Also : Shloka Entertainments | వాల్తేరు వీరయ్య సహా ఐదు భారీ చిత్రాల హక్కులు సొంతం చేసుకున్న బ్యానర్
Read Also :HIT 2 | హిట్ 2 ట్రైలర్ టైం చెబుతూ.. అడివి శేష్ టీం కొత్త పోస్టర్
Read Also : Jr NTR | మాస్ హీరో క్లాస్ లుక్ అదిరింది.. ట్రెండింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్టిల్