Acharya Scene | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా విడుదలైన చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. కథ బాగానే ఉన్న కథనం కొత్తగా లేదని కొరటాల మార్కు ఈ చిత్రంలో కనిపించలేదని ప్రేక్షకులు వెల్లడించారు. కొరటాల డైలాగ్స్, ఎలివేషన్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. కాగా ఈ చిత్రం ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.34.65 కోట్ల షేర్‌ను సాధించింది. ఇప్పటికే కొన్ని చోట్ల డ్రాప్స్ కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుంచి కామెడీ ప్రోమోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.
చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి సెక్యూరిటీ ఆఫిసర్ల గెటప్‌లలో వచ్చి విలన్లను చంపుతూనే కామెడీ పండిస్తారు. ఈ సీన్ మాత్రమే ఆచార్యలో హైలైట్‌గా ఉందని ప్రేక్షకుల అభిప్రాయపడ్డారు. మూడేళ్ళ తర్వాత మెగాస్టార్‌ను వెండితెరపై చూడబోతున్నాం అనే ఆశతో వచ్చిన మెగా అభిమానులను ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి రోజు 30కోట్ల దాకా షేర్‌ను సాధించిన ఈ చిత్రం రెండవ రోజు సగానికి సగంపైనే కలెక్షన్లు తగ్గి కేవలం 5కోట్ల షేర్‌ను మాత్రమే సాధించింది. ఇక ఈ చిత్రం ఓటీటీలో కూడా మే చివరి వారంలోపు స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. పూజాహెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్‌చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Their Timing😅
Prasad garuu, Ram garuu😀Book your tickets now & have a Massive experience in Theatres💥#AcharyaInCinemas
Megastar @KChiruTweets @AlwaysRamCharan @hegdepooja #SivaKoratala #ManiSharma @NavinNooli @DOP_Tirru @sureshsrajan @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/DKvlI8rOAu
— Konidela Pro Company (@KonidelaPro) May 1, 2022