అగ్ర కథానాయకుడు చిరంజీవి 158వ చిత్రం తాలూకు రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి-దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో ఈ సినిమా కీలక షెడ్యూల్ జరుగుతున్నది.
ఇందులో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. ప్రతీకార నేపథ్య కథాంశమిదని, హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని, చిరంజీవి మునుపెన్నడూ చూడని మేకోవర్‌తో కనిపిస్తారని చిత్రబృందం చెబుతున్నది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఫిజికల్‌గా మరింత ఫిట్‌గా తయారయ్యారు చిరంజీవి. ఈ సినిమాలో నటించే కథానాయికతో పాటు ఇతర తారాగణం వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె.చక్రవర్తి రెడ్డి, రచన-దర్శకత్వం: బాబీ కొల్లి.