మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’. అగ్ర హీరో చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నయనతార కథానాయిక. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఆదివారం నుంచి చిరంజీవి, ఫైటర్స్ బృందం పాల్గొనగా.. ైస్టెలిష్ ైక్లెమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించారు.
విజువల్ వండర్లా ఈ ఫైట్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో మెగా అభిమానులు సంబరాలు చేసుకునేలా ఈ ఫైట్‌ని డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. చిరంజీవి చరిష్మా, గ్రేస్ ఈ సీక్వెన్స్‌లో తారాస్థాయిలో ఉంటాయని తెలుస్తున్నది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాణం: షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్.