టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టిన రోజు సందర్బంగా కొత్త అప్డేట్ తో అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చిరంజీవి 153వ ప్రాజెక్టుకు గాడ్ ఫాదర్ టైటిల్ ను ఫైనల్ చేశారు. రక్షాబంధన్ సందర్భంగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్ర లుక్‌తోపాటు స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీలో సోదరి పాత్రలో నటిస్తున్న కీర్తిసురేశ్ చిరుకు రాఖీ కడుతున్న గ్లింఫ్స్ వీడియో ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
తాజాగా మరో క్రేజీ అప్ డేట్ చిరు ఫ్యాన్స్ ముందుకొచ్చింది. బాబీ (కేఎస్ రవీంద్ర) Bobby మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..తన డైరెక్షన్ లో చేస్తున్న 154వ ప్రాజెక్టు స్పెషల్ లుక్ ఒకటి షేర్ చేసుకున్నాడు. బాక్సాపీస్ గ్యాంగ్‌స్టర్..వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. త్వరలో షూటింగ్ మొదలు అంటూ ట్విటర్ ద్వారా లుక్ షేర్ చేశాడు. చిరు ముఠామేస్త్రి స్టైల్ లో చేతిలో ఆయుధం పట్టుకొని పడవ అంచున నిలబడగా..పక్కనే చాలా మంది రౌండప్ చేయడం లేటెస్ట్ లుక్ లో చూడొచ్చు.
మొత్తానికి చిరంజీవి ఇమేజ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను బాబీ ఆడియెన్స్ కు అందించబోతున్నాడని తెలిసిపోతుంది. పూనకాలు లోడింగ్..అంటూ బాబీ రిలీజ్ చేసిన స్టిల్ ఇపుడు ఆన్ లైన్ లో హల్చల్ చేస్తోంది.
#PoonakaaluLoading 💥💥
— Bobby (@dirbobby) August 22, 2021
Make way for OG Mass Monster, Box Office ka Gangster, one and only MEGASTAR 😎#Mega154 filming begins soon! #HBDMegastarChiranjeevi
Megastar @KChiruTweets @ThisIsDSP @MythriOfficial pic.twitter.com/eIDv12pzD1
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!