టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య షూటింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజాతో లూసిఫర్ రీమేక్ షూటింగ్ తో బిజీగా అయిపోయాడు. మరోవైపు మెహర్ రమేశ్, బాబీ డైరెక్షన్ లో రెండు సినిమాలు చేయనున్నాడు. వీటిలో బాబీ ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఓ ప్రకటన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే చిరంజీవి కొత్త సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో రౌండప్ చేస్తోంది. డైరెక్టర్ మారుతి (Maruthi) ఇటీవలే చిరంజీవిని కలిసి ఓ కథ వినిపించాడట. మారుతి చెప్పిన స్టోరీ లైన్ కు ఇంప్రెస్ అయిన చిరు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన తర్వాత మరోసారి తనను కలువాలని చెప్పాడట. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న కల నెరవేరే సమయం రానుండటంతో..చిరు సూచన మేరకు పర్ ఫెక్ట్ కథను సిద్దం చేసే పనిపై ఫోకస్ పెట్టాడని ఫిలింనగర్ లో చర్చలు నడుస్తున్నాయి.
అంతా కుదిరితే మారుతి-చిరంజీవి కాంబోలో వచ్చే ప్రాజెక్టును కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయని సమాచారం. మారుతి ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా తెరకెక్కిస్తుండగా..షూటింగ్ చివరి దశలో ఉంది.
ఇవికూడా చదవండి..
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!