ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ అందుకోబోతున్న సందర్భంగా ఆయన్ను టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన మోహన్‌లాల్‌కు శుభాకాంక్షలు అందించారు. మోహన్‌లాల్‌తో తనకున్న అనుబంధాన్ని తెలిపే ఓ ఫొటోను కూడా ఈ సందర్భంగా చిరంజీవి షేర్ చేశారు.
‘డియర్ లాలెట్టన్.. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మీరందుకోబోతున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన ప్రయాణం.. ఐకానిక్ పెర్ఫార్మెన్స్, భారతీయ సినిమాను సుసంపన్నం చేశాయి. నిజంగా ఇది మీకు తగిన గుర్తింపు’ అని తన పోస్ట్‌లో చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.