Unstoppable Season 4 | నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో ప్రకటించినప్పుడు బాలయ్య హోస్ట్ అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏంటీ బాలయ్య హోస్ట్‌గా చేస్తున్నాడా? నిజమేనా? అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ‘అన్‌స్టాపబుల్’ షో ను విజయవంతం చేశాడు. ఇక ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో కొత్త సీజన్ కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ షోకి సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి.
అయితే 4వ సీజన్‌కు సంబంధించి ఒక సాలిడ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే.. 4వ సీజన్లో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు సమాచారం వచ్చింది. ఈ వార్తపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి. అయితే చిరు పుట్టినరోజు (ఆగష్టు 22)నాడు ఈ ప్రకటన రావోచ్చని సమాచారం. ఇక బాలకృష్ణ, చిరంజీవి ఒకే వేదికపై కనిపించనుండడంతో అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు. ఆహా డేట్ ఎప్పుడో చేబితే రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఆహాను ట్యాగ్ చేసి కామెంట్లు పెడుతున్నారు. ఈ షోలో మెగాస్టార్‌తో పాటు నాగార్జున, బాలీవుడ్ స్టార్స్ తదితరులు పాల్గోనబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై ‘ఆహా’ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also read..