Avatar: Fire and Ash | ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’.. పార్ట్ 3 అనౌన్స్ చేసిన జేమ్స్ కామెరూన్
Avatar: Fire and Ash | టైటానిక్, అవతార్, అవతార్ ది వే ఆఫ్ ది వాటర్ సినిమాలతో బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఈ మూడు సినిమాలు హలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించాయి.
Avatar: Fire and Ash | టైటానిక్, అవతార్, అవతార్ ది వే ఆఫ్ ది వాటర్ సినిమాలతో బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఈ మూడు సినిమాలు హలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించాయి. అయితే అవతార్ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు జేమ్స్ కామెరూన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి అవతార్, అవతార్ ది వే ఆఫ్ ది వాటర్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం రానున్నట్లు ఒక ఈవెంట్లో వెల్లడించాడు కామెరూన్.
అవతార్ మూడవ భాగం అవతార్- ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire and Ash) అనే పేరుతో రాబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 19 2025న విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు. మొదటి భాగంలో గాలి, రెండో భాగంలో నీటిని మూడో భాగంలో నిప్పును ఇలా పంచభూతాల కాన్సెప్ట్‌ను ప్రధాన అంశంగా తీసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.
వరల్డ్ సినిమా హిస్టరీలో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రాలలో అవతార్ చిత్రాలు టాప్ టెన్‌లో ఉంటాయి. ఇక అవతార్ 2 అయితే ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో సుమారు 55 వేలకుపైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. సామ్ వర్తింగ్టన్, జోయ్ సాల్దన, కేట్ విన్స్లెట్, స్టీఫెన్ లాంగ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు.
Just announced at #D23, our title for the next Avatar film:
Avatar: Fire and Ash. Get ready to journey back to Pandora, in theaters December 19, 2025. pic.twitter.com/gZkCCsTl9x
— Avatar (@officialavatar) August 10, 2024
Also Read..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

