Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు-సన్నిహితుల విషయంలో ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులలో పాల్గొంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్ దాదాపు పూర్తవగా, ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన “మీసాల పిల్ల” పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.
ఇదే సమయంలో చిరంజీవి విశ్వంభర చిత్రంలో కూడా కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేస్తున్నారు. అలాగే వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీతో (కె.ఎస్. రవీంద్ర) మరో భారీ సినిమా ప్రారంభించిన మెగాస్టార్ ప్రస్తుతం ఆ షూటింగుల్లోనూ బిజీగా ఉన్నారు. ఇంత వరుస పనుల్లో ఉన్నప్పటికీ, చిరంజీవి తాజాగా తన మేనేజర్ కుమార్తె బారసాల వేడుకకు భార్య సురేఖ, కూతురు సుస్మితతో కలిసి హాజరయ్యారు. వేడుకలో పాల్గొని చిన్నారికి ఆశీర్వాదాలు అందించారు. ఆ బేబీకి “అలేఖ్య” అనే పేరు స్వయంగా మెగాస్టార్ నామకరణం చేయగా, కుటుంబ సభ్యులు ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. చిరంజీవి ప్రేమాభిమానాలు నిండిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి తన మేనేజర్ స్వామినాథ్ కుమార్తె నామకరణ వేడుకకు సతీసమేతంగా హాజరు కావడం చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరోవైపు మేనేజర్ కూతురికి చిరు ఇచ్చిన సర్ప్రైజింగ్ గిఫ్ట్ చూసి ఆ ఫ్యామిలీ కూడా చాలా ఆనందపడిందని వీడియో ద్వారా తెలుస్తుంది. స్టార్ హీరో అయినప్పటికీ తన సిబ్బంది కుటుంబ వేడుకకు హాజరైన చిరంజీవి నిరాడంబరతను అభిమానులు, నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.
Megastar @KChiruTweets Garu and Surekha Garu graced the naming ceremony of Manager Swamynath’s daughter today and blessed the baby girl with their warm wishes✨ pic.twitter.com/Tix55I0Dk1
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 5, 2025