స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానుల్లో వచ్చే కిక్కే వేరు. తాజాగా చిరంజీవి, వెంకటేశ్ ఇద్దరూ ఇలాగే కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రతి ఏడాదీ 80ల్లోని తారలంతా ‘80s రీ యూనియన్’ పేరిట కలిసి సందడి చేయడం కొన్నేళ్లుగా వస్తున్న రివాజు. ఈసారి ఈ కలయిక చెన్నైలో జరుగనున్నది. అది ఎవరి ఆతిథ్యంలో అనేది మాత్రం తెలియాల్సివుంది.
ప్రస్తుతం వీరిద్దరూ ఆ వేడుకకే స్పెషల్ ఫ్లైట్‌లో బయలుదేరారు. ఆ సందర్భంగానే స్టార్ హీరోలిద్దరూ విమానంలో ఫోజులిచ్చారు. 80ల్లో గొప్ప చిత్రాల్లో నటించిన కథానాయకులు చిరంజీవి, వెంకటేశ్. నేటికీ వీరిద్దరి ప్రభ దిగ్విజయంగా సాగుతూనే ఉంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంలో వెంకటేశ్ అతిథి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్నది.