Acharya | ఈ రోజుల్లో సినిమా ఎంత బాగా తెరకెక్కించాము అనే దాని కంటే.. ప్రమోషన్స్ ఎంత బాగా చేసుకున్నాము అనేది చాలా ముఖ్యం. అందుకే స్టార్ హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా అందరూ తమ సినిమా ప్రమోషన్స్ కోసం బాగా టైం కేటాయిస్తూ ఉంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న ఆచార్య సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. కొరటాల తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మరింత జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమాలోని ఒక పాటను విడుదల చేయడానికి చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు.
సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఈ పాట గురించి అభిమానులతో పంచుకున్నారు. భలే భలే బంజారా అంటూ సాగే ఈ పాట ఇవాళ ( సోమవారం ) విడుదల కానుంది. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ ఈ పాటలో డాన్స్ చేయడంతో దీనిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో పాట విడుదలకు సిద్ధం చేస్తున్నారు. పైగా తండ్రి కొడుకులు కలిసి డాన్స్ చేసిన పాట కావడంతో దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు దర్శక నిర్మాతలు. అందుకే ఎప్పుడు కెమెరా ముందుకు రాని కొరటాల కూడా ఈ పాట ప్రమోషన్ కోసం వచ్చాడు.
బంజారా సాంగ్ లో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు పోటీపడి డాన్స్ చేశారు అంటూ దర్శకుడు కొరటాల చెబుతుంటే అభిమానులు ఆగలేకపోతున్నారు. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళకు కచ్చితంగా తమిళంలో విజయ్ బీస్ట్ సినిమా ప్రమోషన్స్ గుర్తుకు రాక మానవు. ఎందుకంటే ఆ సినిమాలో ఒక్కో పాట విడుదలయ్యే ముందు దర్శకుడు నెల్సన్, అతడి టీం కలిసి ఒక ప్రమోషన్ వీడియో చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఆ పాట గురించి ప్రేక్షకులకు ముందుగా ఒక ఫీల్ వదిలి.. ఆ తర్వాత యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాశారు.
ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే చేస్తున్నాడు. ఆచార్య సినిమా పాటకు సంబంధించిన మొదటి ఫీలర్ అభిమానుల కోసం వదిలాడు. ఇది చూసిన తర్వాత పాటపై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. పైగా కొడుకును డామినేట్ చేస్తాను అంటూ చిరంజీవి కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. మరోవైపు తండ్రి ముందు తగ్గేదే లే అంటున్నాడు రామ్ చరణ్. మొత్తానికి ఈ పాట ఎలా ఉండబోతుందో అని మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే వేచి చూస్తున్నారు.
చిరంజీవి ఆచార్య ట్రైలర్‌పై క్రేజీ అప్ డేట్.. మెగా ప్రమోషన్స్ మొదలు..”
Ram Charan | ఆచార్యలో రాంచరణ్ కనిపించేది ఎంతసేపంటే..?”
Acharya | ఆర్ఆర్ఆర్ను ఫాలో అవుతున్న ఆచార్య..!”
Acharya | చిరంజీవి ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా సీఎం జగన్..!”