టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)-కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్యను త్వరలోనే హిందీలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే హిందీలో విడుదల చేసే బ్యానర్ ఏంటో తెలిసిపోయింది.
పెన్ స్టూడియోస్ సంస్థ ఆచార్యను ఇండియావైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్టు బీటౌన్ వర్గాల టాక్. పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ హిందీ రైట్స్ కూడా పెన్ స్టూడియో దక్కించుకోవడం విశేషం. మూడేళ్లుగా సెట్స్ పై ఉన్న ఆచార్య చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా…కొరటాల శివ టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో సామాజిక కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో రాంచరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
మరోవైపు చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్, గాడ్ ఫాదర్ చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. దీంతోపాటు బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా, వెంకీ కుడుములతో మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు చిరు.