Acharya Pre-Release Event | చిరంజీవి ప్రస్తుతం సినిమాల వేగాన్ని పెంచాడు. ఎన్నడూలేని విధంగా ఓకే సారి నాలుగైదు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. కథలను ఓకే చేయడం కాకుండా షూటింగ్‌లను కూడా పూర్తి చేస్తున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలై ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నమోదు చేశాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై రెట్టింపు అంచనాలను నమోదు చేశాయి. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
ఈ క్రమంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న విజయవాడలోని సిద్దార్థ జూనియర్ కాలేజ్‌లో నిర్వహించనున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రానున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తున్నాయి.