టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరక లేకుండా ఉన్నారు. ఇప్పటికే మూడు సినిమాల మాస్టర్ ప్లాన్‌తో బిజీగా ఉన్న చిరంజీవి ఇపుడు మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో చిరు 154 (Chiru154) సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వాల్తేరు శీను టైటిల్ పరిశీలనలో ఉండగా..పూనకాలు లోడింగ్ (Poonakalu Loading) అంటూ ఇప్పటికే ఓ అప్డేట్ కూడా ఇచ్చేశాడు బాబీ.
అయితే ఈ చిత్రం ప్రారంభ కార్యక్రమం నవంబర్ 6న 11:43న గ్రాండ్‌గా జరుగనుంది. అంతేకాదు మూలవిరాట్ దర్శనం ఫస్ట్ లుక్ పోస్టర్ అదే రోజు మధ్యాహ్నం 12:06 గంటలకు విడుదల చేయనున్నారు. ఆగస్టు 22న చిరు 154 ప్రాజెక్టు అప్డేట్ ఇచ్చాడు బాబీ. సీ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రంలో చిరు వింటేజ్ మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు అప్డేట్ ద్వారా హింట్ ఇచ్చేశాడు బాబీ.
#Mega154
— Mythri Movie Makers (@MythriOfficial) November 4, 2021
Celebration doesn't end with Diwali!
In front, there is MEGA festival 💥💥
More #PoonakaaluLoading on 6th November 🤙🤙
Megastar @KChiruTweets @dirbobby @ThisIsDSP 🔥🔥 pic.twitter.com/bujADOPRrH
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు నవంబర్ 6న బయటకు రానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Janhvi Kapoor Langa Voni | లంగావోణిలో జాన్వీకపూర్..దీపావళి లుక్ అదిరింది
Shyam Singha Roy | స్పెషల్ అట్రాక్షన్‌గా ‘శ్యామ్ సింగరాయ్’ భామల ఫస్ట్ లుక్
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి