ట్రెండ్‌కు భిన్నంగా సినిమా చేశా!
‘ఇప్పటివరకు విభిన్న కథా చిత్రాల్లో నటించా. అయితే నా కెరీర్లో చేసిన పెద్ద సినిమా మా త్రం ఇదే’ అన్నారు చేతన్‌కృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ధూం ధాం’ ఈ నెల 8న విడుదలకానుం ది. సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎంఎస్ రామ్‌కుమార్ నిర్మించారు.
‘ఇప్పటివరకు విభిన్న కథా చిత్రాల్లో నటించా. అయితే నా కెరీర్లో చేసిన పెద్ద సినిమా మా త్రం ఇదే’ అన్నారు చేతన్‌కృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ధూం ధాం’ ఈ నెల 8న విడుదలకానుం ది. సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎంఎస్ రామ్‌కుమార్ నిర్మించారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో చేతన్‌కృష్ణ మాట్లాడుతూ ‘ఫస్ట్‌ర్యాంక్ రాజు, బీచ్‌రోడ్ చేతన్, రోజులు మారాయి.
గల్ఫ్ చిత్రాల ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైనర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అలాంటి సమయంలో ఈ కథ కుదిరింది’ అన్నారు. సినిమా కథ గురించి చెబుతూ ‘తన కొడుకు అన్నింట్లో ది బెస్ట్‌గా ఉండాలని తపిస్తుంటాడు తండ్రి. ఆయన చేసిన గారాబంతో కొడుకు మరింత అల్లరివాడవుతాడు.
అతని వల్ల ఓ అమ్మాయి సమస్యలో చిక్కుకుంటుంది. దానికి తానే పరిష్కారం చూపించాలని హీరో చేసే ప్రయత్నమే ఈ సినిమా ఇతివృత్తం’ అన్నారు. సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ కామెడీ ప్రధానాకర్షణగా నిలుస్తుందని, చాలా మంది సీరియర్ ఆర్టిస్టులు భాగం కావడం వల్ల సినిమాకు భారీతనం వచ్చిందని చేతన్‌కృష్ణ తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న థ్రిల్లర్స్ ట్రెండ్‌కు భిన్నంగా చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ధూం ధాం’ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని ఆ యన ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

