Hebah Patel | చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన లవ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘ధూం ధాం’. సాయికిశోర్ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మాత. నవంబర్ 8న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు మారుతి మంగళవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. నాయకానాయికల ప్రేమకథను పరిచయం చేస్తూ టీజర్ మొదలైంది.
కథానుగుణంగా ఈ సినిమా తండ్రీకొడుకుల ఎమోషనల్ బాండింగ్‌ని ఆవిష్కరించింది. హీరో చేతన్ కృష్ణ విలేజ్ యాక్షన్ సీన్స్, వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్.. ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ సాగింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: గోపీమోహన్, మాటలు: ప్రవీణ్‌వర్మ, కెమెరా: సిద్ధార్థ్ రామస్వామి, సంగీతం: గోపీసుందర్.