క్యూబా పోరాటయోధుడు చే గువేరా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘చే’. ‘లాంగ్ లివ్’ ఉపశీర్షిక. బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్‌ని పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘తొలిసారి భారతీయ చిత్ర సీమలో రూపొందిస్తున్న చే గువేరా బయోపిక్ ఇది.
జీవితమే పోరాటంగా బతికిన చే గువేరా చరిత్రను కళ్లకుకట్టినట్లుగా ఈ సినిమాలో చూపించబోతున్నాం. డిసెంబర్ తొలివారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. లావణ్య సమీరా, పూల సిద్ధేశ్వర్, కార్తీక్ నూనె తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్సమి, జగదీష్, సంగీతం: రవిశంకర్, రచన-దర్శకత్వం: బి.ఆర్.సభావత్ నాయక్.