Chhaava| ఛావా.. ఛావా.. ఛావా.. నెల రోజుల నుంచి ఇండియా మొత్తం ఈ సినిమా పేరే జపిస్తుంది. ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ ఇటీవలి కాలంలో ఏ సినిమాకి రాలేదంటే అతశియోక్తి కాదు. ఈ సినిమా కోసం నార్త్‌లో జనాలు కొట్టుకుంటున్నారట. సినిమా చూసిన వాళ్లు కూడా మళ్లీ మళ్లీ రిపీటెడ్ షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప సినిమా మరొకటి రాలేదని సినీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అసలు.. సినిమా చూసి, కన్నీరు పెట్టుకోకుండా బయటకొచ్చిన ఆడియెన్స్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో.
శంభాజ్ మహారాజుగా విక్కీ కౌశల్ నటన నభూతో నభవిష్యత్. అసలు ఆయన నటనకి సినిమా రంగంలో ఎన్ని అవార్డులుంటే అన్నీ ఇవ్వాల్సిందే. అంత గొప్పగా ఉంది విక్కీ కౌశల్ నటన. అయితే ఈ సినిమా పలు రికార్డులు క్రియేట్ చేయగా, వాటిని ఇతర సినిమాలు బ్రేక్ చేస్తాయా అనేది చెప్పడం కష్టమే. ఫిబ్రవరి నెల 14వ తేదీన థియేటర్లలో విడుదలైన ఛావా ఇప్పటివరకు 562 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. తెలుగు విషయానికి వస్తే ఈ సినిమా ఏకంగా 13 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.బుక్ మై షోలో 12 మిలియన్ టికెట్లు విక్రయమైన తొలి హిందీ మూవీగా ఛావా సరికొత్త రికార్డ్ సృష్టించింది.
స్త్రీ2 రికార్డును సైతం ఛావా మూవీ బ్రేక్ చేసింది .ఈ ఏడాది గ్రాస్ కలెక్షన్ల విషయంలో సైతం ఈ సినిమా హిట్ కావడం జరిగింది. విక్కీ కౌశల్ గత సినిమాల కలెక్షన్ల రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది.ఐదో వీకెండ్ లో సైతం 22 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి స్త్రీ2, పుష్ప2 రికార్డులను ఛావా బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్‌ని ముందు ఉంచింది. 22 రోజుల్లో 500 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ఈ మూవీ ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక .హిందీ సినిమాల్లో సెకండ్ వీక్ లో 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించిన సినిమాగా కూడా ఛావా ఖాతాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ రేటుకు దక్కించుకుంది. ఇప్పుడున్న ఈ సినిమా డిమాండ్ బట్టి.. కనీసం 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది.