మలయాళంలో రూపొందుతున్న భారీ పానిండియా యాక్షన్ కామెడీ సినిమా ‘చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్’. అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, ఇషాన్ షౌకత్, విశాఖ్నాయర్, పూజా మోహన్‌దాస్ ప్రధానపాత్రధారులు. అద్వైత్ నాయర్ దర్శకుడు. రమేశ్, రితేశ్ రామకృష్ణన్, షిహాన్ షౌకత్, ఎస్.జార్జ్, సునీల్‌సింగ్ నిర్మాతలు. 2026 జనవరిలో సినిమా విడుదల కానున్నది. ఈ సినిమాను కేరళలో దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తుండగా, తెలుగులో మైత్రీమూవీమేకర్స్ విడుదల చేస్తున్నది.
బాలీవుడ్లో ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా ఈ సినిమా విడుదల కానున్నది. WWE రెజ్లింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే పాత్రల నుంచి ప్రేరణ పొంది తయారు చేసుకున్న కథ ఇదని, ప్రేక్షకులకు గొప్ప యాక్షన్ కామెడీ ఎక్స్పీరియన్స్ అందించమే లక్ష్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ సి.చంద్రన్, సంగీతం: ముజీబ్ మజీద్, నిర్మాణం: రీల్ వరల్డ్ ఎంటర్టైన్మెంట్స్.