ఒకప్పటి అందాల కథానాయిక, ప్రస్తుతం పూరి కనెక్ట్స్ సీఈవోగా వ్యవహరిస్తున్న ఛార్మి కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన పెట్‌కు గిలిగింతలు పెడుతూ మసాజ్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది. ఇందులో ఫన్నీగా పాటలు పాడుతూ మరోవైపు మసాజ్ చేస్తూ కనిపించింది.
తన పెట్ డాగ్‌ను బ్యాంకాక్ తీసుకెళ్లాల్సిందే అంటూ ఛార్మీ తన పోస్ట్‌కు కామెంట్ పెట్టగా, ఇది తెగ వైరల్ అవుతుంది. ఛార్మి పెట్స్‌ని చాలా ఇష్టపడుతుందనే సంగతి మనందరికి తెలిసిందే. బోరింగ్ సమయంలో వాటితోనే చిల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమాను నిర్మిస్తుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది.
I need to urgently take him to Bangkok 😂😂😂😂😂#mystressbuster 😘 pic.twitter.com/UfeOkcBtVy
— Charmme Kaur (@Charmmeofficial) June 30, 2021