బాలకృష్ణ కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’లో ‘మా బావ మనోభావాలు..’ అనే పాటలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది ఆస్ట్రేలియన్ నటి చంద్రిక రవి. ఈ పాటకు మంచి స్పందన వస్తుండటంపై చంద్రిక రవి మాట్లాడుతూ…‘భారత మూలాలున్న కుటుంబంలో ఆస్ట్రేలియాలో జన్మించాను. మా ఇంట్లో దక్షిణాది సంప్రదాయమే పాటిస్తుంటాం. మన కల్చర్ మా జీవితాల్లో భాగమైంది. బాలకృష్ణ చిత్రంలో ప్రత్యేక గీతంలో కనిపించడం సంతోషంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ పాటకు మంచి స్పందన వస్తున్నది.’ అని చెప్పింది.