రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి-2’. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి పి.వాసు దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘18 సంవత్సరాల తరువాత చంద్రముఖి చిత్రానికి కొనసాగింపుగా ‘చంద్రముఖి-2’ను తెరకెక్కిస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి.