చంద్రహాస్.కె, అంకిత సాహా జంటగా నటిస్తున్న చిత్రం ‘మంగంపేట’. గౌతంరెడ్డి దర్శకుడు. గుంటక శ్రీనివాసరెడ్డి నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో డైలాగులు, చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్.. ఇది పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ అని చెబుతున్నాయి.
సాంకేతికంగా ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. డీవోపీ శివన్ ఈ సినిమాకోసం వాడిన కలర్ గ్రేడింగ్, పెట్టిన షాట్స్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ పూనిక్.జి ఇచ్చిన ఆర్ఆర్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు.
నాగమహేశ్, కబీర్ దుహాన్‌సింగ్, కాలకేయ ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు: కమల్ వి.వి, సహనిర్మాతలు: శ్రీహరి చెన్నం, రాజేంద్ర పోరంకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మానస్ చెరుకూరి, ప్రముఖ్ కొలుపోటి, నిర్మాణం: భాస్కర ఎంటర్టైన్మెంట్స్.