అమరావతి : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏపీలోనూ అమలు చేయాలని ఏపీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ( Ketireddy Jagadeeswar Reddy) కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రకటనను విడుదల చేశారు.
పుష్ప -2 సినిమా (Puspa -2 ) విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోల (Benfit Show) రద్దు, టికెట్ల ధరల పెంపు ఉండబోదని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ స్వాగతించినట్లుగానే ఏపీ కూడా స్వాగతిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం సగటు ప్రేక్షకులు, పరిశ్రమను నమ్ముకున్న ఎందరో సంతోషాన్ని వ్యక్తపరిచారని తెలిపారు. టికెట్ల ధరలను పెంచడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు రావడం తగ్గారని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకని చలనచిత్ర పరిశ్రమ ఉనికిని కాపాడాలని కోఆరు. సినిమా అనే వినోదాన్ని సగటు ధరలను చెల్లించి చూసే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి సినిమాకు ధరలు పెంచే విధానానికి స్వస్తి పలకాలని ఆయన కోరారు. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధ చెందేలా మార్గదర్శకాలు నిర్దేశించటానికి నిపుణుల కమిటీని నియమించి నిర్ణయాలని తీసుకోవాలని ప్రకటనలో కోరారు.