‘ప్రతి మనిషి జీవితంలో జరిగే కథ ఇది. ఈ సినిమాలోని చాలా సీన్స్ నా జీవితంలో జరిగినవే. ఓ కుటుంబంలా అందరం కష్టపడి ఈ సినిమాకు పనిచేశాం. కథను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలకు సెల్యూట్ చెయ్యాలి. దర్శకుడు శివ సినిమాను అద్భుతంగా మలిచాడు.’ అని నటుడు అజయ్‌ఘోష్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మ్యూజిక్షాప్ మూర్తి’. చాందిని చౌదరి కీలకపాత్ర పోషించింది. శివ పాలడుగు దర్శకుడు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు.
జూన్ 14న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా ప్రజాదరణ పొందుతున్నదని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రబృదం మాట్లాడారు. అన్ని వయసులవారికీ కనెక్టయ్యే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో మిగతా భాషల్లో కూడా రాబోతున్నదని నటి చాందినీ చౌదరి చెప్పారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చిత్ర యూనిట్‌ను అభినందించారు.