శివ కందుకూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాయ్ వాలా’. ప్రమోద్ హర్ష దర్శకుడు. హర్షిక ప్రొడక్షన్స్ పతాకంపై రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శివ కందుకూరి, రాజీవ్ కనకాల స్కూటీపై జాలీగా తిరుగుతూ కనిపిస్తున్నారు.
హైదరాబాద్ నేపథ్యంలో ప్రేమ, వారసత్వం అనే అంశాల చుట్టూ వినోదం, భావోద్వేగాల ప్రధానంగా నడిచే కథ ఇదని, త్వరలో టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి వర్ల, సంగీతం: ఆర్.విహారి.