Ashu Reddy | హైదరాబాద్‌కు చెందిన నటి అషురెడ్డి (వెంకట అశ్వినిరెడ్డి కొయ్య) మరియు ఆమె కుటుంబ సభ్యులపై సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు. లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువకుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపాయలు కాజేసినట్లు ఆమెపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు వివరాల ప్రకారం, 2018లో వై.వి. ధర్మేంద్రకు అషురెడ్డితో పరిచయం ఏర్పడింది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా అవకాశాల కోసం వచ్చినట్లు చెప్పి అతనితో స్నేహం పెంచుకుందని, ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని బాధితుడి కుటుంబం తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆర్థిక అవసరాల పేరుతో పలుమార్లు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు.
ధర్మేంద్ర ఇచ్చిన డబ్బుతో కారు, బంగారం, పలు ఆస్తులను కొనుగోలు చేసి వాటిని తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి ఖాయం చేస్తున్నామని చెప్పి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించినప్పటికీ, అనంతరం మాట తప్పినట్లు బాధితుడి తండ్రి యెనుముల సత్యనారాయణ తెలిపారు. 2018 నుంచి 2025 మధ్య నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాల రూపంలో మొత్తం రూ.9.35 కోట్లు తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు. అదనంగా అషురెడ్డి సోదరి కూడా రూ.50 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన CCS పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు.
ఇక అషురెడ్డి పేరు గతంలోనూ కొన్ని వివాదాలతో హాట్ టాపిక్‌గా నిలిచిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్‌లిస్ట్‌లో ఆమె పేరు వెలుగులోకి రావడంతో అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే, ఆ ఆరోపణలను ఆమె ఖండిస్తూ డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో కూడా ఆమె వార్తల్లో నిలిచింది. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరిట నెలకు రూ.399 చెల్లించి ప్రత్యేక కంటెంట్ అందించే విధానాన్ని ప్రకటించడంతో చర్చకు దారితీసింది. లక్షలాది ఫాలోయర్స్ ఉన్న ఆమెకు ఈ ఫీచర్ ప్రారంభించిన మొదటి రోజే వందలాది మంది సబ్స్క్రైబర్లు చేరినట్లు సమాచారం. అయితే, ఈ సబ్స్క్రిప్షన్ కంటెంట్‌పై కూడా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.