Venkatesh | టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh) కుటుంబసభ్యుల పై కేసు నమోదైంది. ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత ఘటనలో దగ్గుబాటి సురేశ్‌బాబు, వెంకటేశ్, రానా, అభిరామ్‌పై 448, 452, 458, 120బి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో సురేశ్ బాబును (ఏ1) గా, వెంకటేశ్ (ఏ2)గా, రానా (ఏ3) , అభిరామ్ (ఏ4)గా నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఫిల్మ్ నగర్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గతంలో ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో బాధితుడిగా ఉన్న నందకుమార్‌కు చెందిన దక్కిన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి ఫ్యామిలీ (Daggubati Family)తో వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. 2022 నవంబర్‌లో జీహెచ్ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. అయితే ఈ స్థలంఓ ఎలాంటి చర్యలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కానీ కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా 2024 జనవరిలో దగ్గుబాటి ఫ్యామిలీ హోటల్‌ను పూర్తిగా కూల్చివేసింది. దీంతో వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నందకుమార్ మళ్లీ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా ఈ కేసులో దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటే నాంపల్లి కోర్టు ఫిలింనగర్ పోలీసులను తాజాగా ఆదేశించింది.
Game Changer | గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఫేకా?.. రిపోర్ట్స్ ఏం అంటున్నాయి అంటే.!
Daaku Maharaaj | డాకుమహారాజ్ సెట్స్‌లో బాలకృష్ణను హత్తుకొని ఏడ్చేసిన చిన్నారి