Dimple Hayathi | టాలీవుడ్ ఐటెం గర్ల్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ డింపుల్ హయాతి మరోసారి వివాదంతో వార్తలలోకి ఎక్కింది. గద్దలకొండ గణేష్‌లో “జర్రా జర్రా” పాటతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డింపుల్, సినిమాల్లో పెద్దగా సందడి చేయకపోయినప్పటికీ… వివాదాల ద్వారా తరచూ మీడియాలో హైలైట్ అవుతోంది. తాజాగా ఆమె తన ఇంటి పనిమనుషులపై హింసాత్మకంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వచ్చాయి. డింపుల్ ఇప్పటి వరకు చేసిన చిత్రాలు పెద్దగా హిట్ కాలేదు కాని, ఆమెకి సంబంధించిన వివాదాలు మాత్రం ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె అసభ్య ప్రవర్తన, వాహనాన్ని డ్యామేజ్ చేశారనే దానిపై ఐపీఎస్ అధికారి కేసు నమోదు చేశారు.
తాజాగా డింపుల్ ఓ ఇద్దరు యువతులని వేధిస్తుందనే విషయం హాట్ టాపిక్ అయింది. తన పెంపుడు కుక్కలను చూసుకునేందుకు ఒడిషాకు చెందిన ఇద్దరు యువతులను పని కోసం తీసుకువచ్చిందట డింపుల్. కానీ వారికి వేతనం ఇవ్వకపోవడం, అసభ్య పదజాలంతో దూషించడం, భయపెట్టడం వంటివి చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.‘మీరు నా చెప్పులంత వాల్యూ చేయరు.. మీరు ఎంత? మీ బ్రతుకెంత?’ అంటూ సదరు అమ్మాయిలతో డింపుల్ భర్త దురుసుగా ప్రవర్తించారని చెబుతున్నారు. జీతం అడిగితే ఇంట్లో నుండి బయటకు పంపేశారట. ఇక నా భర్త లాయర్. నన్ను ఏమి చేయలేరు అంటూ డింపుల్ సదరు అమ్మాయిలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఓ మహిళ వీడియోలో తెలియజేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మొన్నటి వరకు హెల్త్ ఇష్యూలతో సతమవుతూ ఏడాదికి పైగా సినిమాలకు దూరంగా ఉన్న డింపుల్ ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఎక్కువగా వివాదాలలో నిలుస్తూ వస్తుంది. సినిమాల కన్నా వివాదలతోనే ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇక గల్ఫ్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన డింపుల్, గద్దలకొండ గణేష్, ఖిలాడి, రామబాణం లాంటి చిత్రాల్లో కనిపించినప్పటికీ, అన్ని చిత్రాలు ఘోర పరాజయాలను మూటగట్టుకున్నాయి. హిందీ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈ వివాదం నేపథ్యంలో నెటిజన్లు డింపుల్ వ్యక్తిగత జీవితంపై ఆసక్తి చూపుతున్నారు. ఆమె భర్త ఎవరు? పెళ్లి ఎప్పుడైంది? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. గతంలో ఆమెతో కలసి ఉన్న వ్యక్తిని “ఫియాన్స్”గా పిలిచినా, వివాహం జరిగిందా అన్న దానిపై స్పష్టత లేదు. .