Mangli | న్యాయవాదిని చంపేస్తామంటూ బెదిరింపులు…సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. !
Mangli | తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సాంగ్స్‌తో విశేష గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మంగ్లీ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేయడం, అలాగే న్యాయవాదిని బెదిరించడం వంటి ఆరోపణలపై ఆమెపై కేసు నమోదవడం సంచలనంగా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు ప్రకారం, మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరియు మరికొంత మంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Mangli | తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సాంగ్స్‌తో విశేష గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మంగ్లీ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేయడం, అలాగే న్యాయవాదిని బెదిరించడం వంటి ఆరోపణలపై ఆమెపై కేసు నమోదవడం సంచలనంగా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు ప్రకారం, మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరియు మరికొంత మంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ డబ్బులు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు.
అయితే, కాలం గడుస్తున్నా ఎటువంటి లాభాలు ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా, పెట్టుబడిగా ఇచ్చిన అసలు డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతూ న్యాయం కోసం న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో న్యాయవాది జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. బాధితుల తరపున డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా, మంగ్లీ మరియు ఆమె బృందం నుంచి బెదిరింపులు వచ్చాయని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా, ఈ కేసులో దర్శకుడు వేణు ఊడుగుల పేరు కూడా వెలుగులోకి రావడం గమనార్హం. మంగ్లీ, శివ, వేణు ఊడుగుల కలిసి ఫోన్ ద్వారా తీవ్రంగా బెదిరించారని, తనను యాక్సిడెంట్ చేయించి చంపేస్తామని హెచ్చరించారని న్యాయవాది ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసుల వద్ద రక్షణ కోరారు.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, మంగ్లీ, శివ, వేణు ఊడుగుల మరియు ఇతరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.వరుస హిట్ పాటలతో కెరీర్లో దూసుకుపోతున్న మంగ్లీపై ఈ తరహా ఆరోపణలు రావడం సినీ, సంగీత రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిజానిజాలు ఏవో దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా, తన పాటలతో మంచి ఫేమ్ అందిపుచ్చుకున్న మంగ్లీ వివాదాలతో ఇమేజ్ బ్యాడ్ చేసుకుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Case
- lawyer
- Singer mangli
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

