ఆర్ఎక్స్100 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాలు చేస్తుంది. ఇప్పుడు కన్నడలో తన డెబ్యూ సినిమా రెడీ అవుతోంది. ఈ మధ్యే శాండిల్ వుడ్ ఎంట్రీకి సంబంధించిన మూవీ, దాని ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. అందులో పాయల్ తన అందాలను బయటపెట్టేశారు.
పాయల్ ప్రస్తుతం ఆది సాయి కుమార్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వరుస రెండు ప్రాజెక్ట్‌ల్లో ఆది,పాయల్ కలిసి నటిస్తున్నారు. కిరాతక,టీఎంకే అనే చిత్రాలలో ఈ ఇద్దరు కలిసి నటిస్తుండగా, వీటికి సంబంధించిన పోస్టర్స్ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ అమ్మడు తాజాగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి వివాదంలో చిక్కుకుంది.
పెద్దపల్లి పట్టణంలో గతనెల 11వ తేదీన వెంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సినీ నటి పాయల్ రాజ్‌పుత్, షాపు యాజమాన్యం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన బొంకూరి సంతోష్ బాబ్జీ న్యాయవాది డొంకెన రవి ద్వారా పాయల్ రాజ్‌పుత్, షాపింగ్ మాల్ యజమాని వెంకటేశ్వర్లు, అతడి భార్య కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో 12న పిటిషన్ దాఖలు వేశారు. దీనిని పరిశీలించిన జడ్జి కేసు నమోదు చేసి విచారణ జరపాలని పెద్దపల్లి పోలీసులను ఆదేశించారు.