Harshaali Malhotra | ఈ పాపులర్ చైల్డ్ ఆర్టిస్టును గుర్తు పట్టారా..? ఇంతకీ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
Harshaali Malhotra | సల్మాన్ ఖాన్, కరీనాకపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కించిన భజరంగీ భాయ్‌జాన్ (Bajrangi Bhaijaan) చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అతి ముఖ్యమైన పాత్ర షాహిదా మున్నీ అజీజ్. పాకిస్థాన్ నుంచి తప్పిపోయి ఇండియాకు వచ్చే చైల్డ్ ఆర్టిస్ట్ రోల్.
Harshaali Malhotra | మూవీ లవర్స్ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే సినిమాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో చాలానే ఉన్నాయి. ఆ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది భజరంగీ భాయ్‌జాన్ (Bajrangi Bhaijaan). సల్మాన్ ఖాన్, కరీనాకపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కించిన ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. పాపులర్ తెలుగు రైటర్ విజయేంద్రప్రసాద్ స్టోరీనందించిన ఈ చిత్రంలో అతి ముఖ్యమైన పాత్ర షాహిదా మున్నీ అజీజ్. పాకిస్థాన్ నుంచి తప్పిపోయి ఇండియాకు వచ్చే చైల్డ్ ఆర్టిస్ట్ రోల్. షాహిదా పాత్రలో నటించింది హర్షాలీ మల్హోత్రా (Harshaali Malhotra).
ఈ ముంబై చిన్నది మూగ పాత్రలో నటించి.. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో వరల్డ్ వైడ్‌గా అభిమానులను సంపాదించుకుంది. భజరంగీ భాయ్‌జాన్ సినిమా వచ్చి జులై 17తో ఎనిమిదేండ్లు పూర్తి కానుంది. ఒక్క సినిమాతోనే ఇంటర్నేషనల్ స్టార్డమ్ సంపాదించిన హర్హాలీ మల్హోత్రాకు సంబంధించిన అప్డేట్స్ లేక చాలా కాలమే అవుతుంది. ఇంతకీ ఈ క్యూటీ ఏం చేస్తుందో తెలుసా..? హర్హాలీ మల్హోత్రా ప్రస్తుతం కథక్ క్లాసులకు వెళ్తోంది. ఖర్‌లోని కథక్ ట్రైనింగ్ సెంటర్ నుంచి బయటకు వస్తుండగా.. అక్కడే ఉన్న కెమెరామెన్లు హర్షాలీని తమ కెమెరాల్లో బంధించారు.
పంజాబీ డ్రెస్‌లో ఉన్న హర్షాలీ అవే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వుతూ అందరికీ హాయ్ చెప్తూ.. ఫ్రెండ్‌తో కలిసి వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. హర్షాలీ రానున్న రోజుల్లో సినిమాలు చేస్తే.. స్టార్ హీరోయిన్ కావడం పక్కా అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు, మూవీ లవర్స్. మరి హర్షాలీ మల్హోత్రా రాబోయే రోజుల్లో ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందో చూడాలి.
Munni of Bajrangi Bhaijaan! It’s been 8 years to the movie already! Harshaali Malhotra spotted leaving her Kathak class in Khar! #Munni#BoycottbollywoodCompletely #SalmanKhan𓃵 #SalmanKhan #Bollywood #DeepikaPadukone #AliaBhatt #DishaPatani #KatrinaKaif #VickyKaushal pic.twitter.com/twXTjk7tDq
— Jadolya (@JadolyaNews) July 16, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

