Jailer 2 | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటిస్తోన్న క్రేజీ సీక్వెల్ జైలర్ 2 (Jailer 2). కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. జైలర్ 2ను 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని ఇప్పటికే రజినీకాంత్ క్లారిటీ ఇచ్చాడని తెలిసిందే.
జైలర్‌లో తమన్నాపై వచ్చే నువ్ కావాలయ్యా సాంగ్ నెట్టింటిని ఓ ఊపు ఊపేసింది. జైలర్ 2లో కూడా ఈ సాంగ్ లైన్స్‌లోనే మరో పాట కూడా ఉండబోతుంది. బాలీవుడ్ భామ నోరా ఫతేహి స్పెషల్ సాంగ్‌లో మెరువనుంది. జైలర్ 2 స్పెషల్ సాంగ్‌ను ప్రస్తుతం చెన్నైలో షూట్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. మరి కావాలయ్యా క్రేజ్, మ్యాజిక్‌ను సీక్వెల్లో తెరకెక్కిస్తున్న సాంగ్ రీక్రియేట్ చేస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.
నోరా ఫతేహి డ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భామ సిల్వర్ స్క్రీన్‌పై ఎలా మెరువతుందో చూడాలి మరి. జైలర్ 2 ఇటీవలే గోవాలో షూటింగ్ జరుపుకోగా.. ఈ షెడ్యూల్లో విజయ్ సేతుపతిపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారని ఇన్సైడ్ టాక్.
సీక్వెల్లో బాలీవుడ్ భామ విద్యాబాలన్‌తోపాటు కోలీవుడ యాక్టర్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. జైలర్ ఫస్ట్ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్, వసంత్ రవి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా కీలక పాత్రల్లో నటించగా సీక్వెల్లో వారి పాత్రలు కొనసాగింపు ఉంటుందా..;? అనేది సస్పెన్స్ నెలకొంది.
Rajamouli | ‘అవతార్ 3’ ప్రమోషన్స్- రాజమౌళితో జేమ్స్ కామెరాన్ స్పెషల్ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్
Kaantha | కాంత చిత్రానికి థియేటర్లలో ఫ్లాప్ టాక్.. కానీ ఓటీటీలో ఇంప్రెసివ్ రెస్పాన్స్
Tamannaah | క్రేజీ లైనప్.. మరో బాలీవుడ్ ప్రాజెక్టులో తమన్నా