వయసు 50కి చేరువ అవుతున్నా యంగ్స్టర్లాగే అనిపిస్తుంటారు మహేశ్‌బాబు. పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అవ్వడంలో మహేశ్ సిద్ధహస్తుడు. సినిమా సినిమాకూ ఆయనలో కచ్ఛితమైన డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. తాజాగా ఆయన ఎస్.ఎస్.రాజమౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేశ్ పాత్ర ఆంజనేయుడ్ని స్పూర్తిగా తీసుకొని డిజైన్ చేశారట. అందుకే దృఢకాయుడిగా మారే పనిలో బిజీగా ఉన్నారట మహేశ్‌బాబు. ఎప్పుడూ తన బరువును అస్సలు పెరగనివ్వని మహేశ్.. ఈ సినిమాకోసం తొలిసారి బరువు పెరిగే పనిలో పడ్డారట. పాత్రకోసం బరువు పెరగాలి. ముఖ్యంగా దృఢంగా మారాలి అని రాజమౌళి సూచించడంతో దానికోసం శ్రమిస్తున్నారట మహేశ్. బరువు పెంచే ఆహారాన్ని తీసుకుంటూ, ఊబకాయం రాకుండా, బలిష్టమైన కండరాలతో, కట్స్‌తో.. ఎయిట్ప్యాక్ వచ్చేలా శ్రమిస్తున్నారట మహేశ్. ఇందుకోసం హాలీవుడ్‌కి చెందిన ఓ ప్రత్యేక ట్రైనర్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నారట. రెండు భాగాలుగా అత్యంతభారీ వ్యయంతో రూపొందుతోన్న ఈ సినిమాకు నిర్మాత కె.ఎల్.నారాయణ కాగా, ఆయనతోపాటు ఓ హాలీవుడ్ సంస్థ కూడా నిర్మాణంలో భాగం కానున్నదని సమాచారం. ఇప్పటికే కథ ఓ కొలిక్కి వచ్చిందట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలుకానుందని తెలుస్తున్నది.