రాజు జెయమోహన్, ఆద్యప్రసాద్, భవ్యత్రిఖ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బన్ బటర్ జామ్’. రాఘవ్ మిర్దత్ దర్శకుడు. తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని నిర్మాత సి.హెచ్ సతీష్‌కుమార్ ఈ నెల 8న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల దర్శకుడు మోహర్ రమేష్ విడుదల చేశారు.
ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ ఎలిమెంట్స్‌తో టీజర్ హాస్యప్రధానంగా సాగింది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. చార్లి, పొన్వన్నన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: నివాస్ కె ప్రసన్న, రచన-దర్శకత్వం: రాఘవ్ మిర్దత్.