తమిళ చిత్రం ‘బంపర్’ తెలుగులో విడుదల కానుంది. వెట్రి, శివాని నారాయణన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎం.సెల్వకుమార్ దర్శకుడు. ఎస్.త్యాగరాజన్, టి.ఆ నందజ్యోతి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదలకానుంది. శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది కేరళలోని ‘బంపర్’ అనే లాటరీ నేపథ్యంలో సాగే కథ.
ఫ్రెండ్స్‌తో కలిసి అయ్యప్పమాల వేసుకుని కేరళ వెళ్లిన ఓ కుర్రాడు అక్కడ ‘బంపర్’ లాటరీ కొంటాడు. ఆ టికెట్‌కు ప్రైజ్ మనీ వస్తుంది. దాన్ని చేజిక్కించుకునేందుకు అతను పడ్డ కష్టాలు, ఫ్రెండ్స్‌తో పడ్డ ఇబ్బందుల నేపథ్యంలో వినోదాత్మక థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. ఇది మా నాన్న జీవితంలో ఎదుర్కొన్న సంఘటన ఆధారంగా రాసుకున్న కథ. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’ అని చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.