బుజ్జి(హేమలత రెడ్డి) హీరోయిన్గా నటిస్తూ వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా ‘నిన్నే చూస్తు’. శ్రీకాంత్ గుర్రం కథానాయకుడిగా నటిస్తున్నారు. కే గోవర్ధన్‌రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నటి, నిర్మాత హేమలత రెడ్డి మాట్లాడుతూ…మంచి చిత్రాలను నిర్మించాలని పరిశ్రమకు వచ్చాను.
కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా ప్రేమ ఓడిపోకూడదు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాము. పెద్దవాళ్లు ఈ సినిమా చూశాక పిల్లల ప్రేమను అర్థం చేసుకుంటారు. అన్ని వర్గాలకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’ అన్నారు. దర్శకుడు కే గోవర్ధన్‌రావు మాట్లాడుతూ..‘కరోనా సమయంలో మిగతా అన్ని చిత్రాల్లాగే మేమూ ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం సినిమాను విడుదలకు సిద్ధం చేసి మీ మందుకొస్తున్నాం. సుహాసినీ, భానుచందర్, సుమన్ లాంటి పేరున్న ఆర్టిస్టులు మా చిత్రంలో మంచి పాత్రలు చేశారు’ అన్నారు.